‘బలుపు’ సినిమా తరువాత చాల గ్యాప్ తీసుకుని రవితేజా నటిస్తున్న ‘కిక్ 2’ విడుదల కాకుండానే సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఈసినిమా నిర్మాతలు, ఈ సినిమా కోసం నిర్మించిన 2 కోట్ల భారీ సెట్ టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. హైదరాబాద్ చివరిలో ఉన్న రాజేంద్రనగర్ ప్రాంతాలలో ఈ సెట్ ను ఒక మినీ గ్రామంగా రూపొందించారు. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రామం లుక్ తో ఈ సెట్ తయారైంది. సహజత్వం కోసం అత్యంత వ్యయప్రయాసలతో నిర్మించిన ఈ సెట్ కు 2 కోట్ల ఖర్చు అయింది అంటే ఎవ్వరు నమ్మలేని విధంగా ఈ సెట్ డిజైన్ ఉంది అని చూసినవారు అంటున్నారు. ఇంత భారీ సెట్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రతిరోజు రోజుకు 20 లక్షలు చొప్పున ఫిలిం యూనిట్ ఖర్చు పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ‘రేసు గుర్రం’ హిట్ తరువాత సురేంద్ర రెడ్డి మాస్ మహారాజతో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్మాతగా, హీరోగా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాతో అయినా తనకు దశ తిరగాలని ఏవిషయంలోనూ రాజీ లేకుండా ఈ ‘కిక్ 2’ ని తీసి సమ్మర్ రేసుకు రెడీ కావాలని ప్రయత్నిస్తున్నాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: