సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ కాజల్. ఇదిలా ఉంటే కాజల్ ఈ మధ్య కాలంలో నటిస్తున్న మూవీలలో కొద్దిగా గ్లామర్ డోస్ ని పెంచుతూ వస్తుంది. ప్రస్తుతం తను విపరీతంగా ఆందాలు ఆరబోసిన ఓ అప్ కమింగ్ ఫిల్మ్ రిలీజ్ కి సిద్ధం కాబోతుంది. మేటర్ లోకి వెళితే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘టెంపర్’ సినిమా కోసం, కాజల్ కాస్త రెచ్చిపోయింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీలలో కాజల్ కొంచెం పద్దతిగా కనిపించినప్పటికీ, ఈసారి మాత్రం కాజల్ పొట్టి డ్రస్సులతో ప్రేక్షకులకి అందాల విందు చూపించబోతుంది. ముఖ్యంగా పూరీ జగన్నాధ్ దర్శకుడిగా ఉండటంతో, కాజల్ అందాలని మరింత క్లోజ్ లో చూపించాడు. టెంపర్ మూవీ చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం కాజల్ తన గత సినిమాల కంటే ఎక్కువ గ్లామరస్ గా కనిపించబోతోంది. అలాగే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం కాజల్ అగర్వాల్ కొన్ని బోల్డ్ కాస్ట్యూమ్స్ ని కూడా ట్రై చేసింది. పూరీ జగన్నాధ్ అయితే సాంగ్స్ పిక్ఛరైజైషన్ లో కాజల్ అందాలనే టార్గెట్ చేసినట్టుగా ఉందంటూ చిత్ర యూనిట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి టెంపర్ మూవీలో కథ ఎలా ఉన్నప్పటికీ, గ్లామర్ మాత్రం కావాలినంత ఉంటుందంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కెర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలనుకుంటున్న ఈ సినిమాని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పూరీ చూపిస్తున్న గ్లామర్ డోస్ కి జూనియర్ సైతం ఏ మాత్రం అడ్డు చెప్పలేదంట. మొత్తంగా టెంపర్ మూవీ ఓ గ్లామరస్ మూవీ రిలీజ్ కి సిద్ధం కాబోతుందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: