పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే సాధారణ విషయం కాదు. మూవీ అంతా ఓ స్టైల్ అయితే, మూవీలో పవన్ ఇంట్రడక్షన్ అంతా ఓ సపరేట్ స్టైల్. సరిగ్గా ఇలాంటిదే పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీలో జరుగుతుంది. క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’ మూవీలో పవన్ కోసం భారీ ఇంట్రడక్షన్ ని ప్లానింగ్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విషయాల్లో చిత్ర యూనిట్ హై క్వాలీటిని మెయింటెన్ చేస్తున్నారు. ఈ గోపాల గోపాల మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాకు అందిన సమాచారం మేరకు గోపాల గోపాల మూవీలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కోసం దాదాపు 50 లక్షలతో విజువల్ వండర్ ని క్రియేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చే ఇంట్రడక్షన్ సీన్ చూడగానే ఆడియన్స్ షాక్ అయ్యేలా చిత్ర యూనిట్ డిజైన్ చేసింది. అయితే ఈ ఇంట్రడక్షన్ లో సీన్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ని ఉపయోగించారంటూ క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ కిషోర్ పార్ధసాని, సృష్టి విఎఫ్ఎక్స్ క్రియేట్ చేస్తున్న విజువల్ వండర్స్ ని చాలా జాగ్రత్తగా, దగ్గరునుండి చూసుకుంటున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ హై రేంజ్ లో ఉండేలా నిర్మాతలు కూడ దగ్గరుండి చూసుకుంటున్నారు.వెంకటేష్ ఓ కామన్ మాన్ గా కనిపించనున్న ఈ సినిమాలో, వెంటకటేష్ కి శ్రియ శరన్ నటిస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాని 2015 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: