బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సౌత్ బ్యూటీ, ఇలియాన. ఇలియాన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి, అక్కడ హీరోలతో రొమాన్స్ చేస్తుంటే, ఆ విషయాలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు సౌత్ లో గ్లామర్ రోల్స్ చేయమంటే, చాలా కండిషన్స్ ని పెట్టిన ఇలియాన, ఇప్పుడు మాత్రం ఎటువంటి కండిషన్స్ లేకుండానే, మూవీలో గ్లామర్ అవసరం ఉన్నా, లేకున్నా తను మాత్రం తెగ చూపిస్తుంది. దీనంతటి కారణం, బిటౌన్ స్టార్ డం ని సంపాదించుకోవాలనే కోరికతోనే అని సౌత్ మార్కెట్ లో టాక్స్ వినపిఇస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇలియానకి ఓ ఖరీదైన కానుకని బిటౌన్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇచ్చాడు. 80 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ కారుని సైఫ్ అలీ ఖాన్, ఇలియానకి ఇచ్చినట్టుగా బిటౌన్ లో వార్తలు వస్తున్నాయి. అలాగే ఇలియాన బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ హీరోతో డేటింగ్ చేస్తుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయాలను ఎవరైనా అడిగితే, మొహమాటం లేకుండా వారికి క్లాస్ పీకుతుంది. అయితే, తన వ్యక్తిగత జీవితం గురించి ప్రాధాన్యత ఇవ్వొద్దని చెబుతోంది గోవా బ్యూటీ ఇలియానా. "నేనెవరికీ నా పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. పెళ్లయ్యేంతవరకూ నేను ఒంటరినే. నా వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచాలనుకుంటా. నా కుటుంబానికి కూడా చాలా కాలం నుంచి తెలుసు. అందరికీ నా జీవితం గురించి తెలియాలనుకోను" అని ఈ గోవా బ్యూటీ చెబుతుంది. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ ఇచ్చి కానుకని అర్ధం ఏమిటో, ఇప్పటికీ బిటౌన్ ఇండస్ట్రీ ఏ మాత్రం అర్ధం కావడం లేదంట. ఇంతకీ ఈ విషయం కరీనాకపూర్ కి తెలియకుండా సైఫ్ చేశాడంట. ప్రస్తుతం బాలీవుడ్ లో 'హ్యాపీ ఎండింగ్' అనే సినిమాలో సైఫ్, ఇలియాన ఇద్దరూ జంటగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: