ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి తెరమరుగైన జగపతి బాబుకు బాలకృష్ణ ‘లెజెండ్’ ఒక ఊహించని టర్నింగ్ ఇచ్చింది. హీరో నుండి విలన్ గా మారిన జగపతి బాబుకు మన టాలీవుడ్ హీరోలు మంచి గౌరవాన్ని ఇస్తున్నారు. గత వారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో జగపతికి మరింత పేరు వచ్చింది.  అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తనకు సరైన విలన్ గా జగపతి బాబుని ఏరికోరి ఎంచుకుని నటింపచేసిన ‘లింగ’ ప్రమోషన్ లో జగపతి బాబుకు సరైన ప్రాముఖ్యత ఆ సినిమా నిర్మాతలు ఇవ్వడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. రజినీ ‘లింగ’ కు సంబంధించి విడుదలైన టీజర్ కూడా రజినీకాంత్ తో పాటు హీరోయిన్స్ అనుష్క, సోనాక్షిలకు ప్రాముఖ్యత కనిపిస్తున్నా ప్రధాన విలన్ పాత్ర పోషిస్తున్న జగపతి బాబు ప్రస్తావన ఎక్కడా లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  గత ఆదివారం జరిగిన ‘లింగ’ తమిళ టీజర్ ఆవిష్కరణలో రజినీతో పాటు అనుష్క, సోనాక్షిల హడావిడి కనిపించినా జగపతి బాబు ఎక్కడా కనిపించక పోవడం అందరకీ షాకింగ్ గా మారింది. ఈమధ్య కాలంలో జగపతి బాబు బ్యాక్ పైన్ తో బాధ పడుతున్న కారణంతో ఈ టీజర్ లాంచింగ్ ఫంక్షన్ కు వెళ్ళలేదా? లేదంటే ‘లింగ’ నిర్మాతలు అప్పుడే జగపతి బాబును మరిచిపోయారా? అనే మాటలు వినిపిస్తున్నాయి.  కానీ సంస్కారానికి చిరునామాగా ఉండే రజినీకాంత్ ఈ పొరపాటును సరిదిద్దుతాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: