తన ట్విటర్ ద్వారా ఎంతో మంది పై సెటైర్లు వేసి ఒక ఆట ఆడుకున్న సమంతకు తన అందం అంతాపోతే పరిస్థితి ఏమిటి అనే భయం పట్టుకుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెపుతోంది దీనితో రోజు జిమ్ లో కసరత్తులు చేస్తే తన అందం ఏమైపోతుందోనని భయంతో జిమ్ కు వెళ్ళడానికి కుడా భయపడి పోతున్నాను అంటూ పోజులు ఇస్తూ తన ఫోటోలను తన ట్విటర్ లో పెట్టి హడావిడి చేస్తోంది.  అందుకే కాబోలు ఆమధ్య ఒక నిర్మాత ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో చేసే అవకాశం ఇచ్చి భారీ పారితోషికం ఆఫర్ చేసి ఆ పాత్రకు సరిపడినట్లుగా తన ఫిజిక్ ను మార్చుకోవడానికి జిమ్ కు వెళ్లమని సలహా ఇచ్చినా తన అందం ఎక్కడ పోతుందో అంటూ ఆ అవకాశాన్ని వదులుకున్నానని ఆ మధ్య ఒక ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది ఈ మాయలేడి. తనకు జిమ్ కు వెళ్ళి వర్కౌట్ లు మొదలు పెట్టగానే ఇలాగే కసరత్తులు చేసి తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకున్న ప్రియాంకా చోప్రా గుర్తుకు వచ్చి జిమ్ అంటేనే భయం పుడుతోంది అంటూ టీషర్టు, త్రీఫోర్త్ వేసుకుని కాళ్లకు స్పోర్ట్స్ షూ తగిలించి, చేతులకు వర్కవుట్ గ్లోవ్స్ కూడా వేసుకుని ఆ జిమ్ లో ఒక మూల దాక్కున్న ఫోటోను తన ట్విటర్ లో పెట్టి హడావిడి చేస్తోంది సమంతా..   

మరింత సమాచారం తెలుసుకోండి: