ఈరోజు ఉదయం విడుదలైన నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ లో రోహిత్ పేల్చిన ‘మా పెదనాన్నే సిఎం’ అనే డైలాగ్ బాగా కలిసి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా మారి రోహిత్ ను మాస్ డైలాగ్స్ తో మాస్ కు నచ్చేలా ప్రెజంట్ చేసాడు అనే వార్తల హడావిడి మొదలైంది. స్టైలిష్ లుక్ తో రోహిత్ చేసిన యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్ర సామాన్య ప్రేక్షకులకు బాగా నచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సినిమాకు పేరుకు నారా రోహిత్ హీరో అయినా ఈ సినిమాకు సమకూర్చిన స్క్రీన్ ప్లే ఈ సినిమా గుండె కాయగా మారి ఈ వెరైటీ స్క్రీన్ ప్లే ‘రౌడీ ఫెలో’ అసలైన హీరో అని అంటున్నారు. రావ్ రమేష్ డైలాగ్స్, పోసాని కామెడీ, ఈ సినిమాను నిలబెట్టడమే కాకుండా ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రోహిత్ కోరికను ఈ సినిమా తీరుస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ వారం మరే సినిమా ఈ సినిమాకు పోటీగా నిలిచే అవకాశం లేకపోవడంతో ఈ వీకెండ్ అంతా బాక్స్ ఆఫీసు వద్ద నారా వారి హడావిడి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది అని విశ్లేషకుల అభిప్రాయం.  ఏమైనా ఈ సంవత్సరం రోహిత్ పెద్ద నాన్నకే కాకుండా రోహిత్ కు కూడా కలిసి వచ్చే సంవత్సరంగా మారబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: