ఐదు పదుల వయసుకు దగ్గర పడ్డ సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం పై వచ్చినన్ని వార్తలు భారతదేశంలో మరే హీరో పైన వచ్చి ఉండవు. ఈరోజు టాప్ హీరోయిన్స్ గా బాలీవుడ్ ను ఏలుతున్న చాలామంది హీరోయిన్స్ తమ కెరియర్ ప్రారం దశలో ఈ కండల వీరుడుకి ప్రేయసిలుగా బాలీవుడ్ మీడియాను షేక్ చేసిన వారే. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్టు తీసుకుంటే అది ఒక వ్యాసంలా మారుతుంది.  ప్రస్తుతం సల్మాన్ వ్యక్తిగత జీవితంలో ప్రేయసిగా వెలుగొందుతున్న రోమీనియన్ బ్యూటీ యూలియా వంటూర్‌ను సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ పెళ్ళికి పిలవడమే కాకుండా ఆ పెళ్లిలో అందరికీ పరిచయం చేశాడట. తన సన్నిహిత మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఆమెను పరిచయం చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు హాట్ హాట్ గా వస్తున్నాయి.  ముంబాయి నుండి ప్రచురితమయ్యే ప్రముఖ దిన పత్రికముంబై మిర్రర్‌లో ఈ మేరకు ఒక వార్తాకథనం కూడా రావడంతో సల్మాన్ మనసు మారి రోమీనియా దేశ ప్రజలకు ఇంటి అల్లుడిగా మరబోతున్నాడా అనే సందేహం మరల పుట్టుకు వస్తోంది. అర్పిత పెళ్ళిలో యూలియా సల్మాన్ కుటుంబ సభ్యులతో కలిసిపోయి ఆ పెళ్ళి అంతా తానై తిరిగిందని ముంబాయి మిర్రర్ కధనం.  అయితే గతంలో పెళ్ళి పీటలు వరకు సల్మాన్ తో నడుస్తాను అని మాట ఇచ్చి మనసు మార్చుకుని ప్రస్తుతం కత్రీనా కపూర్ గా మారిపోయిన పొడుగు కాళ్ళ సుందరి కత్రినాలా మోసం చేస్తుందా లేదంటే త్వరలోనే సల్మాన్ ను పెళ్ళి కొడుకుగా మారుస్తుందా అనే విషయం త్వరలో తేలబోతున్న సల్మాన్ ఖాన్ కోర్టు కేసుల నిర్ణయం బట్టి ఉంటుంది అని బాలీవుడ్ మీడియా కధనాలు రాస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: