ఇప్పటి వరకు రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చేనెల డిసెంబర్ లో ప్రారంభం కాబోతున్న పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ మహేష్ ను భయపెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ సినిమా నిర్మాత ఈ సినిమాను డిసెంబర్ లో మొదలు పెట్టి వచ్చే సంవత్సరంలో మే లో విడుదల చేస్తాము అని విడుదల చేసిన ప్రకటన అని అనుతున్నారు.  ఇప్పటి వరకు ప్రారంభమే కాని పవన్ సినిమా ఒక విధంగా మహేష్ ను భయ పెట్టడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు.ఈ సంవత్సరం సంక్రాంతికి రామ్ చరణ్ ‘ఎవడు’ మహేష్ ‘వన్’ సినిమా విజయాన్ని దెబ్బ తీసినట్లుగా అదే చరిత్రను వచ్చే సంవత్సరం మహేష్, కొరటాల శివల సినిమాను పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ దెబ్బతీసే అవకాశం ఉండని మహేష్ భయం అని టాక్.  దీనికి కారణం పవన్ సినిమా అనుకున్న విధంగా మే లో విడుదల అయితే జూన్ లో విడుదల చేద్దామనుకుంటున్న మహేష్ సినిమా ఆసల పై నీళ్ళు చల్లినట్లే అని అంటున్నారు . ఎన్నో అంచనాలతో వస్తున్న పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ హవా ధియేటర్లలో రెండు, మూడు వారాలు ఉంటుంది కాబట్టి జూన్ మధ్య లో మహేష్ సినిమాను విడుదల చేయడానికి పరిస్థుతులు అనుకూలించవని అప్పుడే గాసిప్పులు మొదలయ్యాయి.  ఒకవేళ అనుకోకుండా పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ మే లో కాకుండా జూన్ లో విడుదల అయితే మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సమ్మర్ రిలీజ్ గా రావడం ఇక కష్టమే అనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆలోచిస్తే మహేష్ ఆశలను ఈ సంవత్సరం అబ్బాయ్ రామ్ చరణ్ నీరు కారిస్తే బాబాయ్ పవన్ వచ్చే సంవత్సరం మహేష్ ఆసల పై నీళ్ళు చల్లుతాడా? అంటూ అప్పుడే మహేష్ పవన్ ల సినిమాల పై సెటైర్లు వినిపిస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: