మంచు విష్ణు హీరోగా మాత్రమే కాకుండా బిజినెస్ పరంగా కూడ ముందుకు దూసుకుపోతున్నాడు. హీరోగా ఎంత బిజిగా ఉంటాడో, అంత కంటే ఎక్కువ రెట్లు తన బిజినెస్ వ్యవహారాలతో ఫుల్ బిజిగా ఉంటాడు. అందుకే మంచు కుటుంబ హీరోలలో విష్ణుది సరికొత్త పంథా. ఇదిలా ఉంటే మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీని స్థాపించి నిర్మాతగా మారాడు. అటు నిర్మాతగా, హీరోగా బిజీగా ఉంటున్న తన సొంత బ్యానర్ లో బయట హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఉందని ఇది వరకూ తెలియజేశాడు. అందులో భాగంగానే బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు హీరోగా ‘సింగం 123′ సినిమాని ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇప్పటి వరకూ హీరోగా, నిర్మాతగా ఉన్న విష్ణు సింగం 123 తో తనలోని మరో టాలెంట్ ని బయటపెట్టాడు. ఈమూవీకి తను కథని అందిస్తున్నాడు. దీంతో సింగం 123 మూవీతో మంచు విష్ణు రచయితగా పరిచయం కాబోతున్నాడు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న చిత్రానికి కథపై పెద్దగా కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. కథలో పెద్దగా ట్విస్ట్ లు కూడ అవసరం లేదు. కాని నవ్వుకోవటానికి ఉపయోగపడే ఫన్నీ సీన్స్ ఉంటే చాలు. డైలాగ్ లు పని లేకుండా ఎంటర్టైన్మెంట్ ని పొందవచ్చు. సరిగ్గా ఈ తరహా కథనే మంచు విష్ణు, సింగం 123 సినిమాకి అందించాడు. అక్షత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంపూర్నేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: