బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ ఎఫైర్ బ్యూటీస్ గా పేరుతెచ్చుకున్న యాక్టర్స్ రణ్ భీర్ కపూర్, కత్రినా కైఫ్. వీరిద్దరి మధ్య ఎఫైర్ కొన్ని సంవత్సరాలుగా జరగుతుందనే విషయం బిటౌన్ లో అందరికి తెలిసిన ఓపెన్ టాక్. త్వరలోనే వీరిద్దరి పెళ్ళి ఉంటుందంటూ బిటౌన్ లో చాలా మందికి తెలిసిపోయింది. అయితే తాజగా జరిగిన ఓ వ్యవహారంతో కత్రినాకైఫ్ పెళ్ళి, రణ్ భీర్ కపూర్ తో ఆగిపోతుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళితే, పంజాబీ సంప్రదాయాల్లో కలీరా అనేది ప్రాముఖ్యత చెందినది. చేతినిండా ఎరుపు, తెలుపు గాజులు వేసుకుని, వాటికి ఓ ఆభరణాన్ని కట్టుకుని, నూతన వధువు అవివాహితుల తల మీద తన చేతిని అటూ ఇటూ ఊపినప్పుడు ఆ ఆభరణంలో ఉన్న నూలు పోగు లేక ఆకు ఎవరి తల మీద పడితే వాళ్లకి వెంటనే పెళ్లయిపోతుందట. తాజాగా సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లిలో ఈ తరహా ఆశ్వీరచనాలను కత్రినాకైఫ్ అందుకుంది. అర్పితాఖాన్ పెళ్లి తర్వాత ఈ ‘కలీరా’ వేడుక కూడా జరిగింది. ఈ వేడుకలో అర్పితా తన చేతులను ఊపినప్పుడు సరిగ్గా కత్రినా నెత్తి మీద ఓ ఆకు పడిందట. దాంతో కత్రినా త్వరలో పెళ్లి కూతురు కావడం ఖాయం అని ఆ పెళ్లిలో పాల్గొన్న పెద్దవాళ్లు పేర్కొనడం జరిగింది. అలాగే అర్పితా కలీరాలోంచి ఓ ఆకు సల్మాన్ నెత్తి మీద కూడా పడిందట. దీంతో త్వరలోనే కత్రినాకైఫ్, సల్మాన్ ఖాన్ ల పెళ్ళి వుంటుందంటూ బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి భార్యభర్తలుగా పెళ్ళి చేసుకుంటారా? లేక విడివిడిగా వివాహాలు జరుగుతాయా? అంటూ మరి కొందరు చర్చించుకుంటున్నారు. కొందరైతే కచ్ఛితంగా సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ ల వివాహం జరుగుతుందంటూ సూటిగా జాతకం చెబుతున్నారు. ఇలా జరిగితే కత్రినా, రణ్ భీర్ కపూర్ ల పెళ్ళి లేనట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: