పవన్, జూనియర్ లు భయపడినంత అయింది. ఇప్పటి దాకా ‘ఐ’ విడుదల తేదీ పై కొనసాగుతున్న అస్పష్టతకు దర్శకుడు శంకర్ క్లారిటీ ఇవ్వడంతో ఈసారి సంక్రాంతి పోటీకి టాలీవుడ్ టాప్ హీరోలు ఒక కోలీవుడ్ హీరోతో పోటీ పడవలసిన అనివార్య పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. 180 కోట్ల భారీ బడ్జెట్ తో శంకర్ గత రెండు సంవత్సరాలుగా ఒక తపస్సులా తీస్తున్న ‘ఐ’ సినిమా విడుదలను సంక్రాంతి రేసుకు ప్రకటించాడు.  ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా విడుదల తేది ఇప్పుడు టాలీవుడ్ భారీ సినిమాల విడుదలకు టెన్షన్ గా మారింది. ఇప్పటికే సంక్రాంతి రేసుకు అధికారికంగా ప్రకటింప బడ్డ పవన్ ‘గోపాల గోపాల’, ‘జూనియర్ ‘టెంపర్’ లకు విక్రమ్ ‘ఐ’ టెంపరేచర్ ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.  దాదాపు 350 కోట్ల బిజినెస్ పై కన్నేసిన విక్రమ్ ‘ఐ’ సంక్రాంతికి తెలుగులో విడుదలైతే ధియేటర్ల దగ్గర నుంచి పబ్లిసిటీ వరకు అనేక విషయాలలో పవన్, జూనియర్ లకు విక్రమ్ ‘ఐ’ తో విపరీతమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది.  ఈ అనుకోని షాక్ నుండి బయట పడటానికి పవన్, జూనియర్ లతో ఈ సినిమాలను తీస్తున్న నిర్మాతలు టాలీవుడ్ లో సంక్రాంతికి, దసరాకు అనువాద చిత్రాలను విడుదల చేయకూడదు అని నిర్మాతల మండలి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని బయటకు తీసి పవన్ ‘గోపాలుడు’ కి జూనియర్, పూరీల సినిమాకు విక్రమ్ ‘ఐ’ దెబ్బ నుండి రక్షణ కవచం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్లాన్ ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: