నాగచైతన్య నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ కి సంబంధించిన టీజర్ విషయంలో ఓ సమస్య వచ్చింది. ఆదివారం నాగచైతన్య బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా టీజర్ ని విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకూ ఏ హీరోకి సంబంధించిన మూవీ టీజర్ విడుదల టైటిల్ తో రావడం జరుగుతుంది. అయితే ఈ సాంప్రదాయానికి నాగచైతన్య అడ్డుకట్ట వేశాడు. టీజర్ విడుదలకి టైటిల్ అవసరం లేదదంటూ తేల్చేశాడు. టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ వస్తుందనుకుంటే.. ‘మాకే దొరకలేదు’ అంటూ టీజర్‌లో బ్రమ్మి‌తో సెటైర్ వేయించి సందడి చేసింది యూనిట్. ఫ్యాన్స్ కూడ నాగాచైతన్య సమస్యని అర్ధం చేసుకుందని అంటున్నారు. ఎందుకంటే స్వామిరారా ఫేం సుదీర్‌వర్మ డైరెక్షన్‌లో వస్తున్ననాగచైతన్య కాంబినేషన్ కి ఎన్నో టైటిల్స్ ని చూశారు. ఏ టైటిల్ కూడ చివరకి ఫైనల్ కాలేదు. తీరా నాగచైతన్య బర్త్ డేకి కూడ టైటిల్ ఫైనలైజ్ కాకపోవడంతో చేసేదేమిలేక టైటిల్ లేకుండానే టీజర్ ని విడుదల చేశారు. టైటిల్ ని ఫైనలైజ్ అయిన తరువాత మరో టీజర్ వస్తుందంటూ చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. రిలయన్స్ టై‌-అప్‌తో ‘అత్తారింటికి దారేది’ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్ శనివారం రిలీజ్ చేశారు. కృతిసనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్.. ‘మోసపోయే వాడివి కాకూడదంటే మోసం చేయాలనే’ చైతు వాయిస్ ఓవర్‌తో బాగుంది. ఇప్పటి వరకూ ఈ మూవీకి దొరకడు ..మోసగాడు.. మాయగాడు వంటి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ పేర్లల్లో ఏదోఒక పేరుని ఫైనలైజ్ చేసే అవకాశం ఉండొచ్చని టాలీవుడ్ టాక్

మరింత సమాచారం తెలుసుకోండి: