టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ కి తన డెబ్యూ ఫిల్మ్ పిల్లా నువ్వులేని జీవితం తనకు మంచి పాజిటివ్ మార్క్ లని తెచ్చిపెట్టింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ టూర్ ని కూడ చిత్ర యూనిట్ ప్రారంభించింది. వెళ్ళిన ప్రతీ చోట, సాయిధరమ్ తేజ్ కి మెగా అభిమానులు సాధర స్వాగతం పలుకుతున్నారు. అయితే ఓ మూవీకి ప్రేక్షకులను ఉద్ధేశించి ఏ తరహా మాటలు మాట్లాడాలో, ఆ విధంగానే సాయిధరమ్ తేజ్ మాట్లాడుతున్నాడు. ఓ డెబ్యూ హీరో అప్పుడే ఇంత మెచ్ఛ్యూర్డ్ గా మాట్లాడం అనేది అందరిని ఆశ్ఛర్యపరుస్తుంది. అలాగే మరోవైపు మెగా ఫ్యామిలీ అంటూ గొప్ప తరహా మాటలు మాట్లాడుతుంటే, కొన్ని సందర్భాల్లో సాయిధరమ్ తేజ్ వయస్సుకి తగ్గ మాటలు కాదనిపిస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవితం సక్సెస్ టూర్ లో మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలిలో పుట్టడమే తన అదృష్టం.. అవకాశం వస్తే చిరు 150వ చిత్రంలో నటిస్తానని చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల ఈ మేనల్లుడు చెప్పుకొచ్చాడు. మొత్తానికి సాయిధరమ్ తేజ్ మెగా ఓటు బ్యాంక్ ని సురక్షితంగా కాపాడుకోగడనే నమ్మకం మెగా హీరోలకి కూడ కలిగిందట. మొత్తానికి చిరంజీవి 150 సినిమాలో నటించి, తన స్థానాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో సుస్థిరం చేసుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: