కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అఫిషియల్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. గతంలో శంకర్ దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ రోబో2 కి, రజనీకాంత్ హీరోగా ఉంటాడనే న్యూస్ ని కోలీవుడ్ వర్గాలు ఏకీభవించాయి. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ లో హీరో రోల్ కి సంబంధించిన పలు మార్పులపై క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగానే మరో ఆఫర్‌కు ఓకే చెప్పాడట. అది కూడా రజనీకాంత్ ‘రోబో’కు సీక్వెల్! సూపర్ డెరైక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ ‘రోబో 2’కు తొలుత రజనీనే అనుకున్నా, ఎందుకో ఆ ప్రతిపాదన ఓకే కాలేదు. అయితే ఆమీర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ న్యూస్. రజనీకాంత్ నటించిన రోబో మూవీ ఇండియన్ బాక్సాపీస్ ని షేక్ చేయగా, ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందులో ప్రధమంగా రజనీకాంత్ ఆ రోబో సీక్వెల్ నుండి తప్పుకోవడం, తరువాత తన స్థానంలో అమీర్ ఖాన్ ఆ పాత్ర చేయడం వంటి విషయాలు ఇప్పుడు అఫిషియల్ గా మారాయి. శంకర్ కూడ ఎంతో కాలం నుండి బాలీవుడ్ లో డైరెక్ట్ ఫిల్మ్ తీయాలని ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు శంకర్ కి రోబో సీక్వెల్ అనేది కరెక్ట్ సమయం అని అంటున్నారు. గతంలో అమీర్ ఖాన్ నెగిటివ్ రోల్ చేసిన థూమ్3 భారీ వసూళ్ళని రాబట్టింది. ఇప్పుడు రోబో లోనూ అమీర్ ఖాన్ చేస్తున్న నెగిటివ్ రోల్ పై ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ అవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన న్యూస్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ‘రోబో’లో బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ కథానాయిక నటిస్తే, మరి సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: