ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అంటారు. ఎందుకంటే వారు కలిసి నటించినా, కలిసి నిర్మించినా, ఇలా ఏం చేసినా ఆ కాంబినేషషన్ తో వచ్చిన మూవీలు బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్స్ గా నిలిచిపోతాయి. అయితే ఆ కాంబినేషన్ వచ్చే క్రేజ్, ఒక్క మూవీతో బయటకు రాదు. చాలా మూవీలు బయటకు వచ్చిన తరువాత కాని, ఆ తరహా పేరు బయటకు రాదు. అయితే ఇందుకు భిన్నంగా ఓ కాంబినేషన్ పేరు ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ముందు డబ్బై సినిమాలు నిర్మించినా రాని పేరు రాంగోపాల్ వర్మతో ఒక్క చిత్రం తీయగానే ఆయనకు చాలా పేరు వచ్చేసింది. ఆయనే తుమ్మలపల్లి రామసత్యనారాయణ! గతంలో వర్మ దర్శకత్వంలో 'ఐస్ క్రీమ్' ... మళ్లీ ఆయనతోనే ఇప్పుడు 'ఐస్ క్రీమ్ 2' సినిమాలు తీశారాయన. ఇన్నాళ్లూ నిర్మాతగా వున్నా, రాంగోపాల్ వర్మతో సినిమా తీశాకనే, అసలు సినిమా ఎలా తీయాలి? ఎలా రిలీజ్ చేయాలి? అన్న విషయాలు తెలిశాయంటున్నారాయన. ఇక వచ్చే ఏడాది 2015వ సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 8 సినిమాలు బయటకు రానున్నాయని అంటున్నారు. అంతే కాకుండా ఈ నిర్మాత 2015వ సంవత్సరానికి దాదాపు 15 సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. వీటిలో 8 వరుస మూవీలు రామ్ గోపాల్ వర్మతోనే ఉంటాయని చిత్ర వర్గాల నుండి సైతం వినిపిస్తున్న సమాచారం. అయితే ఈ నిర్మాత చెబుతున్న విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాని, ఒకే నిర్మాతతో వరుస మూవీలు తీయటానకిఇ వర్మ ఎంత మాత్రం ఒప్పుకోడనేది అందరికీ తెలిసిన సత్యం. ఒక వేళ ఒప్పుకున్నా ఈ కాంబినేషన్ లో ఎన్ని సక్సెస్ లు అవుతాయో, ఎన్ని డిజాస్టర్స్ గా నిలుస్తాయో చెప్పడం చాలా కష్టం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: