స్టైలిష్‌ బ్యా ట్స్మెన్‌ బాలీవుడ్‌ అందాల భామ అనుష్క శర్మతో తనకున్న బంధాన్ని ఎట్టకేలకు రివీల్ చేశాడు. ఫీల్డ్ లోకి ఎంటర్‌ అయిన అతికొద్ది కాలంలోనే అద్భుతమైన ఆటతీరుతో క్రీడాభిమానుల హృదయాలు విరాట్ కోహ్లి దోచుకున్నాడు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు డేటింగ్ చేస్తున్నారంటూ బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇది నిజమా? అంటూ చాలా మంది విరాట్ కోహ్లిను అడిగి మరీ క్లారిటీ తెచ్చుకుంటున్నారు. అయితే విరాట్ మాత్రం ఇప్పటి వరకూ మౌనంగానే ఉన్నప్పటికీ, తాజాగా తన సహనాన్ని కోల్పోయి, నిజాన్ని ఒప్పుకోవడంతో ఇప్పుడు మేటర్ బయటకు తెలిసిపోయింది. కొంతకాలం వీరిద్దరి ఎఫైర్‌ను ఎవరూ కనిపెట్టకుండా మెయిన్‌టెయిన్‌ చేశారు. కానీ మీడియా కళ్లను తప్పించుకోలేక పోయారు. ఇక ఎంతకాలం దాస్తాం, చెప్పేస్తే ఓ పనై పోలే అనుకున్నాడో ఏమో, అనుష్క శర్మతో తన ఎఫైర్‌ను ప్రపంచానికి చెప్పాడు విరాట్ కోహ్లీ. అవును ఇందులో దాపరికం ఏముంది...? మేం డేటింగ్‌లో ఉన్నాం.. అంటూ కామెంట్ చేశాడు. ఇదంతా సోషియల్ నెట్ వర్క్ లో విరాట్ కోహ్లి ని ఓ నెటిజెన్ అడిగిన సందర్భంలో జరిగింది. దీంతో ఆ న్యూస్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. అంతే కాకుండా "మీకు ఇష్టం వచ్చినట్టు రాయకండి.." అంటూ కూడ మళ్ళీ మీడియాకు తన వంతుగా చెప్పుకున్నాడంట. మొత్తానికి వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు అఫిషియల్ కావడంతో అనుష్క శర్మ కూడ కొద్దిగా రిలీఫ్ అయింది. ఎందుకంటే విరాట్ కోహ్లి కంటే అనుష్క శర్మని బిటౌన్ మీడియా ఎక్కువుగా ఆడుకుంటుంది. ప్రతిరోజు గాసిప్ న్యూస్ లో అనుష్క శర్మ లేనిదే మీడియా మరో న్యూస్ జోలికి వెళ్లడం లేదంట.

మరింత సమాచారం తెలుసుకోండి: