నిన్న ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ తన పిల్లల ప్రవర్తన గురించి చాలామందికి తెలియని కొత్త విషయాలను తెలియచేసింది. తన కూతురు ఆధ్యా చూడడానికి అచ్చు తన తండ్రి పవన్ లా ఉన్నా అలవాట్లు ఇష్టాలు అన్నీ కూడా తనవే వచ్చాయని చెప్పుకొచ్చింది.  ఇక తన కొడుకు అకిరా నందన్ తన పోలికలతో ఉన్నా తన తండ్రి పవన్ ప్రవర్తనకు, ఇష్టాలకు జిరాక్స్ కాపీలా అకిరా నందన్ పెద్దవాడు అవుతున్న కొద్దీ మారిపోతున్నాడు అని అంటూ అనేక ఆ శక్తికర విషయాలను తెలియ చేసింది. అకిరా నందన్ నడక తన తండ్రి పవన్ నడకను పోలి ఉంటుందని అంటూ ఏ పని చేసినా చాల సిన్సియర్ గా, సీరియస్ గా పవన్ లాగే చేస్తాడని. అదేవిధంగా తన తండ్రిలాగే స్పైసీ గా ఉండే ఫుడ్ అంటే అకిరా ఇష్టపడతాడని చెప్పుకొచ్చింది రేణు. పవన్ లాగే అకిరాకు కూడా ఫంక్షన్స్ అన్నా ఆడంబరంగా ఖర్చు పెట్టడం అన్నా ఇష్టం ఉండదు అని చెపుతూ ఈ మధ్యనే తనకు జరిగిన పుట్టినరోజునాడు ఎటువంటి పార్టీలు వద్దు అంటూ ఆ ఖర్చును ఏదైనా అనాథ ఆశ్రమానికి ఇద్దాము అని అకిరా తనను బలవంత పెడతాడని చెపుతూ తెలుగు భాష ఆంటే విపరీతంగా ఇష్టపడే తన పిల్లలిద్దరికీ పప్పూ, టమేటో చారు అంటే విపరీతమైన ఇష్టం అని చెపుతూ తన పిల్లల అభిరుచులు అలవాట్ల విషయంలో అంతర్లీనంగా పవన్ ప్రభావం ఎంతగానో దాగి ఉందని అనేక విషయాలను షేర్ చేసుకుంది రేణు..

మరింత సమాచారం తెలుసుకోండి: