తన పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను మాయచేసే త్రివిక్రమ్ ఎటువంటి మాటలు చెప్పి బుట్టలో పెట్టాడో తెలియదు కాని, గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్న మహేష్, సమంతలను ఒకటిగా చేస్తున్నాడు. మహేష్ బాబుకు సూపర్ హిట్స్ ఇచ్చిన ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలలో వీరిద్దరి జంట హిట్ పెయిర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత సమంత, మహేష్ కు దూరమై ఇతర హీరోలతో నటిస్తూ ఏకంగా మహేష్ సినిమాలనే తన కామెంట్లతో టార్గెట్ చేసే స్థాయికి చేరిపోయింది. దీనితో వీరిద్దరి మధ్య భవిష్యత్ లో ఇక సినిమాలు ఉండవు అనుకున్నారు అంతా. అయితే అందరికీ షాక్ ఇస్తూ ‘మేము సైతం’ కార్యక్రమంలో వీరిద్దరూ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక స్కిట్ లో నటిస్తూ త్రివిక్రమ్ డైలాగ్స్ ను చెప్పబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఈ స్కిట్ రిహార్సల్స్ విషయంలో బిజీగా ఉంటూ త్రివిక్రమ్ దగ్గర డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు టాక్. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఒక సినిమాలో నటిస్తాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో మహేష్, సమంతలను ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా కలిపిన ఈ మాటల మాంత్రికుడు ఇదే జంటతో భవిష్యత్ లో తాను సినిమా తీస్తున్నాను అనే సంకేతాలను ఈ స్కిట్ ద్వారా ఇస్తున్నాడు అనుకోవాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: