ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ప్రతిరోజు తన షూటింగ్ ముగించుకుని తన హోటల్ కు వెళుతున్నప్పుడు ఈరోజు తాను ఏమి కొత్త విషయం నేర్చుకున్నాను అని ఆలోచన చేస్తానని ఆ ఆలోచనల వల్ల వచ్చే మరింత ఉత్సాహంతో మరుసటి రోజు షూటింగ్ కు రెడీ అవుతాననీ చెప్పింది.  అంతేకాదు తాను షూటింగ్ స్పాట్ కు వెళుతున్నప్పుడు తాను ఒక ప్లే గ్రౌండ్ కు వచ్చినట్లుగా ఫీల్ అవుతానని అంతేకాని ఎదో పనిచేయడానికి వచ్చినట్లుగా ఫీల్ అవననీ, అందువల్లనే తాను ఇన్ని సినిమాలలో చేయగలుగుతున్నానని తన మనసులో మాటలు చెప్పింది రకుల్. ఈ మాటలు పవన్ కళ్యాణ్ వరకు చేరినట్లు ఉన్నాయి. అందుకే పవన్ నటించబోయే ‘గబ్బర్ సింగ్ 2’ సెకండ్ హీరోయిన్ గా రకుల్ ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ జత కట్టడానికి ఎంతోమంది హీరోయిన్స్ తపన పడుతున్నా రకుల్ తాను నటిస్తున్న సినిమాల పట్ల చూపుతున్న సిన్సియారిటీ పవన్ దృష్టిలో పడేట్లుగా చేసింది అని అంటున్నారు. పేరుకు సెకండ్ హీరోయిన్ అయినా పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ లో రకుల్ పాత్ర చాల కీలకం అని టాక్. ఈ వార్తలే నిజం అయితే టాప్ హీరోయిన్స్ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ చేరినట్లే అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: