ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుకు ప్రతిస్పందించి ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనే మంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకునె కార్యక్రమం చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్యనే ఇండియన్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని ఒక కుగ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామం అభివృద్ధికి అన్ని విషయాలలోనూ సహాయపడటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అదేవిధంగా మోడీ మాటలను అనుసరిస్తూ మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంత ఊరు మొగల్తూరు దగ్గర ఒక గ్రామం దత్తత తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరిస్తూ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఒక గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ లో దత్తత తీసుకుందామనే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో మహేష్ ఆలోచనలను గుంటూరు జిల్లాలోని ఒక గ్రామం ప్రముఖంగా ప్రభావితం చేస్తోంది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే మహేష్ తండ్రి కృష్ణ ఆలోచనలలో తన సొంత ఊరు బుర్రిపాలెంను మహేష్ చేత దత్తత తీసుకునేల ఒప్పించాలని ప్రయతిస్తున్నట్లు మరో టాక్. ఏది ఎలా ఉన్నా అతి త్వరలో మహేష్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని మోడీ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయాలని ఆలోచనలు చేస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: