తన గంభీరమైన గొంతుతో ఎంతటి వారి పై అయినా మాటల బాణాలు వదిలే మోహన్ బాబు తాను సినిమా రంగంలోకి ప్రవేశించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా రాయబోతున్న 600 పేజీలతో కూడిన సుధీర్గ స్వీయచరిత్ర పుస్తకం అతి త్వరలో టాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారబోతోంది.  ఈ స్వీయ చరిత్రలో మోహన్ బాబు గత 40 ఏళ్లలో తాను నటించిన సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్ గురించి అనేక ఆ శక్తికర విషయాలు ఈ పుస్తకంలో రాయడమే కాకుండా టాలీవుడ్ సినిమా రంగం గురించి ఈ సినిమా రంగాన్ని నడిపిస్తున్న ప్రముఖుల గురించి తన అభిప్రాయాలను ముక్కు సూటిగా మోహన్ బాబు ఈ పుస్తకంలో రాస్తున్నాడని టాక్.  తెలుగు సినిమా రంగానికి రెండు కళ్ళులా ఒక వెలుగు వెలిగిన నందమూరి, అక్కినేని జీవితాల పై ఇతరులు వ్రాసిన పుస్తకాలు వచ్చాయి కానీ, టాలీవుడ్ ను ఏలిన ఆ ప్రముఖులు ఇద్దరూ తమ ఆత్మ కధలను తామే స్వయంగా రాసే సాహసం చేయలేకపోయారు. అయితే అటువంటి లెజెండ్స్ చేయలేని పని మోహన్ బాబు స్వయంగా రంగంలోకి దిగి తన ఆత్మ కథను మొదలు పెట్టడంతో మోహన్ బాబు వేసే సెటైర్లు ఏ ప్రముఖుడి మీద ఉంటాయో అని ఇప్పటి నుంచే చాలామంది ప్రముఖులు భయపడుతున్నట్లు టాక్. మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా వచ్చే సంవత్సరం మార్చి లో ఈ పుస్తకం విడుదల అవుతుంది అని అంటున్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి: