కలువ కన్నుల భామ కాజల్ ఎక్స్ పోజింగ్ లుక్ తో ప్రేక్షకులకు టెంపర్ పెంచాలని పూరి జగన్నాథ్ ప్రయత్నిస్తున్నాడు అని చెప్పే విధంగా వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్న కాజల్ షాకింగ్ లుక్ ఫోటోలను చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. అత్యంత భారీ పంచ్ డైలాగ్స్ చెపుతూ సినిమా అంతా తానై నడిపించే జూనియర్ కూడా కాజల్ హాట్ లుక్స్ పై తన కొత్త సినిమా ‘టెంపర్’ లో కాజల్ పై ఆధార పడ్డాడా అన్నట్లుగా ఉంది ఈ లుక్.  ‘గోవిందుడు అందరివాడేలే’ లో కాస్త బొద్దుగా కనిపించిన కాజల్ తన రూట్ మార్చి స్లిమ్ గా మారి రెడ్ డ్రెస్‌లో సెక్సీగా హాట్ లుక్స్ తో కనిపిస్తూ జూనియర్ కొత్త సినిమా విజయానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చిన పూరి, జూనియర్లు ఈ సినిమాకు సంబంధించిన మరొక షెడ్యూల్ వెంటనే మొదలు పెడతారని టాక్. కాజల్ కూడా ప్రస్తుతం నడుస్తున్న హీరోయిన్స్ పోటీను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు పూరి సలహా మేరకు గోవా బీచ్ లో ఒక సాంగ్ కోసం ఇలా సందడి చేసింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాకు సంబంధించి కాజల్ లేటెస్ట్ ఫోటో మాత్రం వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: