టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ సమంత. గత రెండు సంవత్సరాలుగా సమంత ఫిల్మ్ కెరీర్ ని చూసుకుంటే ఎప్పుడూ తన చేతిలో కనీసం ఆరు చిత్రాలు అగ్రిమెంట్స్ ని పూర్తి చేసుకొని ఉంటాయి. దీంతో సమంతకి ఫుల్ డిమండ్ పెరిగింది. ఆ విధంగా సమంత తన స్టార్ డం ని బిల్డప్ చేసకుంటూ ఇప్పుడు అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే సమంత చేతిలో కేవలం మూడు చిత్రాలే ఉన్నాయి. అందులో రెండు చిత్రాలు షూటింగ్ ని జరుపుకుంటుండగా, మరో చిత్రం అగ్రిమెంట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉంది. దీంతో తనకు ఆఫర్స్ తగ్గాయన్న విషయాన్ని సమంత గుర్తించింది. మళ్ళీ తను ఎప్పటిలాగే బిజిగా మారిపోవాలని సమంత ప్లానింగ్స్ చేస్తుంది. కాని ఇప్పటికిప్పుడు కొత్త ఆఫర్స్ అంటే రావడం కష్టం కదా. ఇప్పటికే చాలా మంది హీరోలు వారి ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజిగా ఉన్నారు. టాలీవుడ్ కి చెందిన టాప్ హీరోలు అందరూ, వారి మూవీలను రీసెంట్ గా స్టార్ట్ చేశారు. దీంతో వీరి మూవీలలో సమంతని తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకు సమంతా మిగతా హీరోలని టార్గెట్ చేసింది. అంటే ఆ లిస్ట్ లో ప్రస్తుతం మరో మూవీకి కోసం సిద్ధంగా ఉన్న హీరో రామ్ చరణ్. ఈసారి రామ్ చరణ్ మూవీలో నటించటానికి సమంత విశ్వప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి సమంత తన సోషియల్ నెట్ వర్కింగ్ అకౌంట్స్ లో పోస్టింగ్ లు చేస్తుంది. తాజాగా, రామ్‌ చరణ్‌ డ్యాన్స్ ని ఆకాశానికి ఎత్తేసి, తన పొగడ్త ఏంటో రామ్ చరణ్ కి చూపింది. రామ్ చరణ్ డ్యాన్స్ చాలా బాగా చేస్తాడంటూ పొగడటం స్టార్ట్ చేసింది. అంతే కాకుండా తను త్వరలోనే రామ్ చరణ్ ని కలుస్తానని, అందుకు స్సెషల్ రీజన్ ఉందంటూ.. కూడ చెప్పుకొస్తుంది. మొత్తానికి ఆ స్సెషల్ రీజన్ ఏంటి? అనేది ఇప్పటి వరకూ ఎవ్వరికీ అర్ధం కాని మేటర్. అయితే ఈ వ్యవహారంలో సమంత, చరణ్ సరసన ఆఫర్ కోసం తనకి బిస్కట్స్ వేస్తుందనేది క్లియర్ గా తెలుస్తుందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: