సౌత్ పిల్మ్ ఇండస్ట్రీ నుండి బిటౌన్ వెళ్లిన గోవా బ్యూటీ ఇలియానకి హాట్ ఆఫర్ ఒకటి వచ్చిందంటూ బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. మేటర్ లోకి వెళితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన మూవీలో బాక్సాపీస్ ని షేక్ చేసిన మూవీలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కేవలం 'దబాంగ్' సినిమా తప్ప మరి దేనికీ సీక్వెల్ తీయలేదు. అయితే చాలా మంది నిర్మాతలు సల్మాన్ ఖాన్ నటించిన బాక్సాపీస్ షేక్డ్ మూవీలకి సీక్వెల్స్ తీయాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ తరహా సూచనల మేరకు సల్మాన్ ఖాన్ త్వరలోనే 'కిక్' సినిమా సీక్వెల్ తీయబోతున్నారని సమాచారం. తెలుగులో సూపర్ హిట్ అయిన కిక్ సినిమాను హిందీలో రీమేక్ చేసిన సల్మాన్ ఖాన్, ఇప్పుడు సాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వంలో దానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నారట. ఇప్పుడు కిక్ సీక్వెల్ లో ఇలియాన నటించే అవకాశం ఉందంటూ బిటౌన్ హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సల్మాన్ నటించిన సినిమాలన్నింటిలోకీ కిక్ అత్యధిక వసూళ్లు సాధించింది. కిక్ మూవీ దాదాపు రూ. 234 కోట్లు వసూలు చేసినట్లు బాక్సాఫీసు రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీని తరువాత 'ఏక్ థా టైగర్' 188 కోట్లు వసూలు చేసింది. కిక్ మూవీ పంపిణీదారులకి ఈ మూవీ లాభాలనుచూపించడంతో నిర్మాతపై పంపిణీదారులు కూడ ఒత్తిడి తీసుకువస్తున్నారంట. మొత్తంగా కిక్ సీక్వెల్ సల్మాన్ ఖాన్ సరసన ఇలియాన ఆఫర్ ని పొందడంతో, తను ఫుల్ జోష్ లో ఉందంటున్నారు. అయితే ఈ న్యూస్ ని సంబంధించిన డిటైల్స్ ని సాజిద్ త్వరలోనే వెల్లడించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: