టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్న హీరో, నితిన్. ఇదిలా ఉంటే నితిన్ ప్రస్తుతం నటిస్తున్న అప్ కమింగ్ మూవీ చిన్నదాన నీ కోసం. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో వరుస హిట్ అందుకొని ఫుల్ జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ ‘చిన్నదాన నీకోసం’ అంటూ మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తికావొచ్చింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆడియో వేడుకను ఈ నెల 27న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం నవంబర్ 27న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనున్న చిన్నదాన నీకోసం ఆడియోకి ముఖ్య అతిధిగా నాగార్జున హాజరవుతున్నాడు. అలాగే కాకుండా మరో ప్రత్యేకమైన విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. నితిన్ నటించే అప్ కమింగ్ ఫిల్మ్స్ లో నాగార్జున గెస్ట్ రోల్ చేయటానికి ఒప్పుకున్నట్టుగా క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నాగార్జున వద్ద నుండి నితిన్ పక్కా క్లారిటీ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ మూవీలో నితిన్ సరసన నాగార్జున గెస్ట్ రోల్ చేస్తాడు? అనే దానిపై త్వరలోనే క్లారిటి రానుంది. ప్రస్తుతం నితిన్ నటించిన చిన్నదాన నీ కోసం ఆడియో ఫంక్షన్ ఈ నెల 27న రిలీజ్ అయి, డిసెంబర్ 19న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే అక్కినేని అఖిల్ హీరోగా రానున్న డెబ్యూ ఫిల్మ్ లో నితిన్ స్పెషల్ రోల్ చేయడం తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: