రాజకీయాలలో ప్రత్యక్షంగా కనిపించే కులాల ప్రస్తావన సినిమా రంగంలో మాత్రం ఇప్పటి వరకు అంతర్లీనంగానే ఉంటూ వచ్చింది. అయితే గత కొద్దిరోజులుగా కొందరు ప్రముఖ దర్శకులు కులాల ప్రస్తావనతో చేసిన కామెంట్లు అర్ధాలు మారి వెబ్ మీదియాలోనే కాకుండా టాలీవుడ్ లోనే సంచలనం సృస్టిస్తున్నాయి.  ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాకు దర్శకత్వం వహించిన రవి కుమార్ చౌదరి కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన ఈ సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణ నా బాస్ అంటూ భయం అన్నది చౌదరీల బ్లడ్ లో లేదు అన్న మాటలు అప్పట్లో తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తే ఇప్పుడు ఇదే దర్శకుడు రవికుమార్ చౌదరి తాను రవితేజా సినిమాకు ఎప్పుడూ దర్శకత్వం వహించననీ అంటూ రవితేజా పై అనుచిత వ్యాఖ్యలు చేసాడు అంటూ రవికుమార్ చౌదరి ఫేస్ బుక్ లో కనిపించాయి.  అయితే ఆకామెంట్స్ టాలీవుడ్ లో పెనుదుమారాన్ని సృష్టిస్తున్న నేపధ్యంలో రంగంలోకి దిగిన రవికుమార్ చౌదరి తాను రవితేజాను కించపరుస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఎవరో కావాలని తన ఫేస్ బుక్ ను హ్యాక్ చేసి ఈ కామెంట్లు తనకు తెలియకుండా పోస్ట్ చేసారని చెపుతూ తన ఫేస్ బుక్ ఎకౌంట్ ను క్లోజ్ చేసుకుంటున్నట్లుగా చౌదరి ప్రకటించాడు. ఇది ఇలా ఉండగా దర్శకుడు మారుతి ఈ మధ్య జరిగిన ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ 'ఇక్కడికొచ్చిన ఫ్యాన్స్ అంతా కుల అభిమానంతో వచ్చినవాళ్లేనని' అని అనుకోకుండా తన టంగ్ స్లిప్ అయ్యాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే మారుతి కూడా తాను అటువంటి కామెంట్స్ చేయలేదని తరువాత ఖండన ఇచ్చాడు. టాలీవుడ్ లో పేరు ఉన్న దర్శకుల నోటి వెంట వస్తున్న ఈ కుల ప్రస్తావనలు టాలీవుడ్ సినిమా రంగాన్ని ఎన్ని చీలికలు చేస్తాయో అన్న భయం చాలామంది దర్శక నిర్మాతలను పీడిస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా ఈ దర్శకులు ఇద్దరు తాము ఎటువంటి కులాల ప్రస్తావన చేయలేదని చెపుతున్నారు కాబట్టి ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోతుందా లేకుంటే మరిన్ని మలుపులు తిరుగు తుందా అనే విషయం పై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: