“లెజెండ్” సినిమా నుండి “పిల్లా నువ్వులేని జీవితం” వరకు తెల్లని గడ్డంతో రఫ్ లుక్ లో విలన్ పాత్రలు పోషించిన జగపతి బాబు కొరటాల శివ దర్శకత్వంలో మహేహ్ నటిస్తున్న సినిమాలో తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు హీరో, విలన్ పాత్రలలో చూసిన జగపతి బాబును క్లీన్ గా షేవ్ చేసుకుని మంచి ఖరీదైన కారులో అందమైన సూట్ వేసుకుని పారిశ్రామిక రంగాన్ని శాసించే బడా పారిశ్రామిక వేత్తలా కనిపిస్తాడట.  మహేష్ సినిమాలోని తన లుక్ గురించి జగపతి బాబు స్వయంగా ఒక మీడియా సమావేశంలో తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో తన లుక్ అదేవిధంగా తన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుందని జగపతి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని తన పాత్ర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు జగపతి కామెంట్ చేసాడని తెలుస్తోంది. ఒక కార్పరేటు సంస్థ అధిపతిగా జగపతి బాబు కనిపించబోయే ఈ సినిమా కూడా హిట్ అయితే జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మరో ఐదు, ఆరు సంవత్సరాలు టాలీవుడ్ ను ఏలుతాడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: