కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న యాక్టర్స్ సూర్య అండ్ జ్యోతిక. సూర్య,జ్యోతిక కాంబినేషన్ లో మూవీలు వచ్చి చాలా సంవత్సరాలే అయింది. వీరిద్దరికి పెళ్ళి అయిన తరువాత నుండి జ్యోతి దాదాపు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చింది. అయితే తాజాగా జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ని మళ్ళీ షురూ చేయాలని ప్రయత్నాలని వేగవంతం చేస్తుంది. తెలుగులో కొద్ది మూవీలే చేసినప్పటికీ జ్యోతికి మంచి పేరే వచ్చింది. అయితే తెలుగు మార్కెట్ కంటే కోలీవుడ్ మార్కెట్ లోనే జ్యోతికకి సూపర్ స్టార్ డం ఉంది. తను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని భావిస్తుంది కాబట్టి, పలు ఫిల్మ్ ఇండస్ట్రీలకి సంబంధించిన ఫిల్మ్స్ ని చూస్తుంది. అయితే, హౌ ఓల్డ్ ఆర్ యు అనే ఓ మలయాళ సినిమా చూసి, ఆ సినిమా నచ్చడంతో, ఆ మూవీ తమిళ వెర్షన్‌లో నటించేందుకు జ్యోతిక నిర్ణయం తీసుకుంది. చాలా విరామం తర్వాత ఆమె తమిళంలో నటిస్తున్న సినిమా ఇదే. అలాగే తనకి ఎప్పటి నుండో డైరెక్షన్ మీద మమకారం చాలా ఎక్కువ. తను ఓ మూవీకి డైరెక్షన్ చేయాలనేది తన కోరికగా చెప్పుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే జ్యోతికి దగ్గర ఉన్న కథని, తన భర్త అయిన సూర్యకి వినిపించింది. సూర్య కూడ జ్యోతికి చెప్పిన కథ బాగుంటడంతో తను హీరోగా నటించేందుకు సిద్ధం అని చెప్పాడు. జ్యోతికకి డైరెక్షన్ చాలా కొత్త కాబట్టి, సహాయ దర్శకుడిగా టాలెండ్ ఉన్న దర్శకుడిని పెట్టుకొని మూవీ తీసేందుకు జ్యోతిక సిద్ధం అవుతుందని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే బయటకు రానున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: