టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న న్యూస్, టెంపర్ మూవీ. టెంపర్ మూవీలో జూనియర్ షర్ట్ లెస్ కనిపించడంతో ఆ మూవీ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరింత హాట్ టాపిక్ అయింది. నిజానికి మొదటగా టెంపర్ మూవీని స్టార్ట్ చేసేటప్పుడు, జూనియర్ తో షర్ట్ లేకుండా నటింపచేయాలనే ఆలోచన పూరీకి అస్సలు లేదంట. షూటింగ్ కోసం గోవ వెళ్ళిన తరువాత తన సీన్స్ లో కొద్ది మార్పులు చేసి, జూనియర్ తో ఈ ఫీట్ చేయించాడు పూరీ జగన్నాధ్. ప్రస్తుతం ఇదే, మూవీకి హైలెట్ మారింది. ఇదిలా ఉంటే 'టెంపర్‌' సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లు చూసిన రాంగోపాల్‌వర్మ ఈ చిత్రానికి విపరీతమైన హైప్‌ తీసుకొచ్చే స్టేట్‌మెంట్లను తనదైన శైలిలో ఇచ్చేసాడు. ఇదంతా పూరీ కోసం వర్మ చేశాడనే టాక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇంత వరకూ టెంపర్ రష్ ని ఎవ్వరికి చూపించని పూరీ, ఇప్పుడు వర్మ కోసం ప్రత్యేకంగా చూపించి, తన నోటి నుండి ఈ డైలాగ్స్ ని వినిపించడంతో ఇదంతా పెయిడ్ టాక్స్ అనే న్యూస్ బయటకు వస్తుంది. ఏదేమైనా జూనియర్ షర్ట్ లెస్ గా వస్తున్న టెంపర్ మూవీపై సినీ ప్రేక్షకుల్లోనూ హైప్ క్రియేట్ అయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ రిపోర్ట్స్ నుండి అందిన సమాచారం ప్రకారం, టెంపర్ మూవీలో కేవలం సాంగ్ లోనే జూనియర్ షర్ట్ లెస్ గా కనిపించడమే కాకుండా, ఓ ఫైట్ లోనూ షర్ట్ లేకుండానే స్టంట్స్ చేస్తాడంట. మొత్తంగా జూనియర్ సెమీ న్యూడ్, టెంపర్ మూవీపైనా ఎవిధమైన రిజల్ట్స్ ని తీసుకువస్తాయో చూడాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: