ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి దృష్టి మేము సైతం ప్రొగ్రామ్ మీదే. ఈ ప్రోగ్రామ్ ని విశాఖలో వచ్చిన హుద్ హుద్ బాధితుల సహాయార్ధం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో ఖర్ఛు పెట్టి చేస్తుంది. అలాగే భారీ మొత్తంలో ఫండ్ ని కలెక్ట్ చేసి ఇవ్వటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మేటర్ లోకి వెళితే, ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మేముసైతం ప్రొగ్రామ్ కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ, ఆ ఈవెంట్ ని చూడటానికి వచ్చేవారికి టికెట్ రేట్స్ ధిమ్మతిరిగిస్తున్నాయి. ఫండ్‌రేజింగ్‌లో భాగంగా డోన‌ర్ కుపన్లు అందుబాటులోకి తెచ్చారు. రూ.500, 3000, 5000 15,000, ల‌క్ష రూపాయ‌లు ఇలా పలు విభాగులుగా ఈ కూపన్స్ ని అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ టికెట్లు అనుకున్నంత మేర అమ్ముడు కావ‌డం లేదు. రూ.500 విలువ‌ల టికెట్లు దాదాపు ల‌క్ష వ‌ర‌కూ ఉన్నాయి. అందులో ఇప్ప‌టి వ‌ర‌కూ 18 వేల టికెట్లు కూడా సేల్ కాలేదు. ఛాంబ‌ర్,కౌన్సిల్‌, ఎఫ్ ఎన్ సీసీ వాళ్ల‌కు ఈ టికెట్లు బ‌ల‌వంతంగా అంట‌గ‌డుతున్నార‌ట‌. అంతే కాకుండా టివి ఆర్టిస్ట్ సభులకి కూడఈ టికెట్స్ ని అమ్మటానికి ప్రయత్నిస్తున్నారు. కొంత మందైతే మాకు వద్దు బాబోయ్ ఈ టికెట్స్ అంటున్న, కంపల్సరీగా టికెట్ కొనాల్సిందే అంటూ 15,000 వేల రూపాయల టికెట్స్ ని అంటగడుతున్నారంట. ల‌క్ష రూపాయ‌ల టికెట్లు 250 వ‌ర‌కూ ఉన్నాయి. ఈ టికెట్స్ ని ఎంత మంది కొంటారో ఎవ్వరికి అర్ధం కావడంలేదు. మొత్తానికి టికెట్ల రేట్స్ ని చూసిన చిన్న తరహా ఆర్టిస్ట్ లు అయితే బెంబేలెత్తుతున్నారు. 30వ తేదీలోపు ఎన్ని టికెట్లు అమ్ముడుపోతాయో చూడాలి మ‌రి. ఏదేమైనా ఇంత ఖర్చు పెట్టి కలెక్ట్ చేసే మనీకంటే, అందరి వద్ద నుండి సరైన విధంగా ఫండ్ ని కలెక్ట్ చేస్తే, హుద్ హుద్ బాధితులకి మరింత సాయం చేయవచ్చనేది కొందరి వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: