టాలీవుడ్ ఫిల్మ్ ఇండీస్ట్రలో హీరోయిన్ గా ఎదగాలంటే ముఖ్యంగా లక్ అనేది ఉండాలి. అది ఏమాత్రం ఏ మాత్రం లేకపోయినా, ఇండస్ట్రీ నుండి ఆ హీరోయిన్ ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉంటాయి. వాటిలోనే మొదటి ఐరన్ లెగ్. మూవీ సక్సెస్ లో కథ అనేది కీలకం అనేది మర్చిపోయిన నేటితరం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, హీరోయిన్ లెగ్గు మహిమ అంటూ, కొత్తగా వారిపై ఏడవటం మొదలు పెట్టారు. దీంతో ఇప్పుడు హీరోయిన్ రోల్ అనేది మూవీకి చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ తరహా ఐరెన్ లెగ్ అనే ట్యాగ్‌ క్యాథరీన్‌ థెరిస్సా తీసుంది. ఈమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద టప టపా రాలిపోతున్నాయి. అల్లు అర్జున్‌ తో నటించిన ఇద్దరమ్మాలు సినిమా కూడ సోసో గా ముందుక సాగింది కాని, మిగతా మూవీలు మాత్రం ఘోర డిసార్టర్స్ ని చూశాయి. దీంతో క్యాథరీన్‌ నటించిన సినిమాలు రెండో వారం పోస్టర్లకి కూడా నోచుకోవడం లేదంటూ ఇండస్ట్రీలో టాక్స్ మొదలయ్యాయి. ఆమె నటించిన తొలి చిత్రం 'చమ్మక్‌ చల్లో' ఎప్పుడొచ్చి పోయిందో కూడా ఎవరికీ తెలీదు. నీలకంఠ, వరుణ్‌ సందేశ్‌లాంటి తెలిసిన పేర్లున్నా కానీ ఆ చిత్రం సౌండ్‌ కూడా చేయలేదు. అలాగే కృష్ణవంశీ, నానిల పైసా కూడా డిజాస్టర్‌గా మిగిలింది. రీసెంట్‌గా వచ్చిన ఎర్రబస్సుతో క్యాథరీన్‌ ఖాతాలో మరో డిజాస్టర్‌ జాయిన్ అయింది. అయితే ఇలా డిజాస్టర్ గా వచ్చిన మూవీలు అన్నీ కథల విషయంలో సత్తాలేకే ఇలాంటి ఫలితాలు వచ్చినా, ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం హీరోయిన్ లెగ్గు అంటూ, నష్టాన్ని అంతా కేథరిన్ పైనే వేస్తున్నారు. దీంతో కేథరిన్ ని హీరోయిన్ గా తీసుకునేందు ఇప్పుడు హీరోలు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: