ఘోర ప్రమాదం నుండి బయట పడ్డ విశాల్ ! కోలీవుడ్ హీరో విశాల్ ఊటీలో ఒక ఘోర ప్రమాదం నుండి బయట పడ్డాడు అనే వార్తలు వస్తున్నాయి. విశాల్ హీరోగా ఊటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఒక సినిమా షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం ఈ సినిమాకు సంబంధించి ఒక రిస్కీ ఫైట్ ఎత్తైన కొండ పై చిత్రీకరిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ ఫైట్ కోసం విశాల్ రోప్ కట్టుకుని 20 అడుగుల ఎత్తైన ప్రదేశం నుండి కిందకు దూకాలి ఈ సీన్ చిత్రీకరిస్తున్న నేపధ్యంలో విశాల్ కట్టుకున్న రోప్ వైర్ తెగిపోవడంతో అంత ఎత్తు నుండి విశాల్ కిందకు పడిపోవడంతో కాళ్ళకు గట్టి దెబ్బలు తగిలాయని వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు విశాల్ కాలు ఎముక ఈ ప్రమాదంలో చిట్లిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విశాల్ ను ఊటీలోని ఒక ప్రముఖ హాస్పటల్ లో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం. విశాల్ సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటిస్తూ ఉంటే ప్రముఖ దర్శకుడు సి. సుందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రమాద వార్త తెలియగానే కోలీవుడ్ సినిమా రంగం ఒక్కసారిగా షాక్ అయింది అని వార్తలు వస్తున్నాయి విశాల్ త్వరలో కోలుకోవాలని కోరుకుందాం..   

మరింత సమాచారం తెలుసుకోండి: