ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న 'గోపాల గోపాల' చిత్రం తొలి మోషన్ పోస్టర్ విడుదలైంది. యూట్యూబ్ లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ పోస్టర్ ను విడుదల చేసింది. 'ఓ మైగాడ్' హిందీ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దేవుడిపై కోర్టులో కేసు వేసే హీరో పాత్రలో వెంకటేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ లో పవన్ కల్యాణ్ ఉయ్యాలలో పడుకుని, కళ్లు మూసుకుని చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తుండగా, ఆ వెనక నుంచి వెంకటేశ్ వచ్చి, అచ్చం పవన్ ఇచ్చిన పోజులోనే నిలబడి ఉండగా గోపాల గోపాల అనే టైటిల్ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ అంతా సింబాలిక్ గా నెమలి ఈకల డిజైన్ ఉంచారు. మొత్తానికి పవన్, వెంకటేశ్ అభిమానుల ఎదురుచూపులు ఇన్నాళ్లకు ఫలించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: