అనుష్క ఇమేజ్ ప్రస్తుతం కోలీవుడ్ మీడియా అనుష్కను ఆకాశానికి ఎత్తేస్తోంది. దీనికి కారణం అతితక్కువ వ్యవధిలో ఆమె నటించిన రెండు బడా సినిమాలు వరసగా కోలీవుడ్ లో విడుదల కావడం. ఎల్లుండి రజినీ ‘లింగ’ రాబోతూ ఉంటే సంక్రాంతికి అనుష్క అజిత్ తో నటించిన ‘ఎన్నై అరిందాల్’ విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలు భారీ సినిమాలే అయినా ఈ రెండు సినిమాలలోను అనుష్క తోపాటు మరో హీరోయిన్ నటించినా, అనుష్క ఆ సినిమా దర్శక నిర్మాతలకు ఎటువంటి సమస్యలు క్రియేట్ చేయకపోవడం కోలీవుడ్ పరిశ్రమను ఆశ్చర్య పరుస్తోంది అని కోలీవుడ్ మీడియా కామెంట్స్ రాస్తోంది.  ‘లింగ’ సినిమాలో తన రోల్ ను సోనాక్షి కథ రీత్యా డామినేట్ చేసినా గౌతమ్ మీనన్ తీస్తున్న ‘ఎన్నై అరిందాల్’ (ఎంతవాడు గానీ) సినిమా స్క్రిప్ట్ విషయంలో ఆ సినిమా దర్శకుడుతో పోట్లాడి మరో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష దెబ్బలాడి తన పాత్రను పెంచుకున్నా తనకేమి పట్టనట్లుగా అనుష్క ప్రవర్తించడమే కాకుండా ఈ సినిమాల దర్శక నిర్మాతలకు ఎటువంటి తలనొప్పి కలిగించకుండా ఉన్న అనుష్క ప్రవర్తన కోలీవుడ్ నిర్మాతలకు విపరీతంగా నచ్చడంతో ప్రస్తుతం కోలీవుడ్ మీడియా ఆమె పై ప్రశంసలు కురిపిస్తోంది. అయితే చాలామంది టాప్ హీరోయిన్స్ సమంత, నయనతార, హన్సిక, కాజల్ వంటి టాప్ హీరోయిన్స్ తమ ఐడెంటిటీ కోసం ఏదో ఒక ఇబ్బందిని దర్శక, నిర్మాతలకు పెడుతున్న నేపధ్యంలో వీరంతా అనుష్కను చూసి తమ పద్దతిని మార్చుకోవాలి అని కామెంట్లు చేస్తూ కోలీవుడ్ మీడియా రాస్తున్న వార్తలు ని తమిళనాడులో విపరీతంగా పెంచేస్తున్నాయి. అనుష్క ప్రవర్తన బట్టి చూస్తూ ఉంటే ఈ యోగా బ్యూటీ చాల వ్యూహాత్మకంగానే ఎత్తుగడలు వేస్తోంది అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: