మొన్న తన 63వ పుట్టినరోజు జరుపుకున్న రజినీకాంత్ కు దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు తమ శుభాకాంక్షలను తెలియచేసిన నేపధ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో నానీ కూడా తాను రజినీకి శుభాకాంక్షలు తెలియచేయడమే కాకుండా తాను ఈమధ్య ‘లింగ’ సినిమా సెట్లో రజినీతో తీయిoచుకున్న ఫోటోను తన ట్విటర్ లో పెట్టడమే కాకుండా రజినీకాంత్ తన పై వేసిన జోక్ ను కూడా షేర్ చేసుకున్నాడు నాని. ‘లింగ’ షూటింగ్ సమయంలో రజినీ దాదాపు 30 నిముషాలపాటు తనను కలిసిన నానీతో మాట్లాడటమే కాకుండా నానీ నటిస్తున్న సినిమాల గురించి వివరాలు అడిగాడట. అదే సందర్భంలో రజినీ ‘బాహుబలి’ సినిమా గురించి మాట్లాడుతూ రాజమౌళి తీస్తున్న ఆ సినిమాలో ఎందుకు నటించడంలేదు అని అడగటమే కాకుండా రాజమౌళిని తన సినిమాలో ఒక పాత్ర ఇమ్మని అడగ వచ్చు కదా ? అని రజినీకాంత్ అన్న మాటలకు షాక్ అయిన నాని బహుశ తన హైట్ సమస్య వల్ల తనకు రాజమౌళి ‘బాహుబలి’ లో అవకాశం ఇచ్చి ఉండరు అని అన్నాడట నాని.  దానికి సూపర్ స్టార్ ప్రతిస్పందిస్తూ హైట్ తో సంబంధం ఏమిటి అలా ఆలోచిస్తే తన హైట్ ఎంత? అంటూ తన పై తాను వేసుకున్న రజినీ సెటైర్ కు తాను ఆశ్చర్య పోయాననీ నాని అప్పటి విషయాన్ని రజినీ పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: