ప్రముఖ కొరియో గ్రాఫర్ ప్రభుదేవా పెద్ద అన్నయ్య రాజు సుందరంకు కూడా కొరియో గ్రాఫర్ గా మంచి పేరుంది. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ బన్నీల పై కామెంట్స్ చేసాడు. తాను ఇప్పటి వరకు దక్షిణాది సినిమా రంగంలో ఎంతోమంది హీరోల పాటలకు కోరియోగ్రఫీ చేసినా తనకు జూనియర్ ఎన్టీఆర్ అల్లుఅర్జున్ ల బాడీలో కనిపించే మూమెంట్స్ తనకు మరే హీరోలోను కనిపించలేదని డాన్స్ పరంగా వీరిని డామినేట్ చేసే హీరోలు ఇప్పట్లో మరెవ్వరూ వచ్చే అవకాశం లేదని కామెంట్స్ చేసాడు.  అయితే కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమాలోని కొన్ని పాటలకు కోరియోగ్రఫీ చేయడానికి మహేష్ ఏరికోరి ఎంచుకున్న రాజు సుదరం తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలు గురించి కాకుండా బన్నీ జూనియర్ల గొప్పతనo గురించి కామెంట్స్ చేయడం మహేష్ బాబు అభిమానులను ఆశ్చర్య పరిచింది.  తన తమ్ముడు ప్రభుదేవలాగే తనకు కూడా సినిమాలకు దర్శకత్వం వహించాలి అన్న కోరికను వ్యక్త పరుస్తున్న రాజు సుందరం తన కోరికను దృష్టిలో పెట్టుకుని ఇలా వ్యూహాత్మకంగా జూనియర్ బన్నీలను పోగుడుతున్నాడా ? అని ఈ ఇంటర్వ్యూ చదివిన వారికి అనిపిస్తుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: