ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవా బ్యూటీ ఇలియానా తన వ్యక్తిగత విషయాలు చాల షేర్ చేసుకుంది. పెళ్ళిలో ఉంగరాలు మార్చుకుని ప్రమాణాలు చేసినంత మాత్రాన పెళ్ళి అయిపోయినట్లుగా తాను భావించననీ కేవలం ‘హేయ్ ఉయ్ ఆర్ మేరీడ్’ అని ప్రపంచానికి తెలియచెప్పే షో బిజినెస్ గా నేటి రోజులలో పెళ్ళిళ్ళు మారిపోతున్నాయని వింత వ్యాఖ్యలు చేసింది ఇలియానా. అంతేకాదు పెళ్ళికి సరైన సమయం, వయస్సు ఉంటుందని తాను భావించడం లేదని అంటూ మన మనస్సులకు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడు పెళ్ళి చేసుకోవచ్చని 70 సంవత్సరాల వయస్సులో కూడా పెళ్ళి చేసుకోవడంలో తప్పులేదు అని అంటోంది ఇలియానా. అదేవిధంగా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అతను తనకు స్నేహితుడు మాత్రమేననీ పెళ్ళి చేసుకునే వరకు తాను సింగల్ గా ఉన్నట్లే లెక్క అని అంటూ తన ప్రేమ గురించి పెళ్ళి గురించి తనకు లేని ఖంగారు మీడియాకు ఎందుకు అంటూ ఎదురు దాడి చేసింది ఇలియానా. తాను టాలీవుడ్ పరిశ్రమకు దూరం అయినా హీరోలు రామ్ రానా లు తనకు తరుచు ఫోన్ చేస్తూనే ఉంటారని చెపుతూ తనకు తెలుగు సినిమా రంగం సెకండ్ హోమ్ లాంటిదని అంటూ ఎవరైనా మంచి కథను చెపితే నటిస్తాను అని కలలు కంటోంది ఇలియానా..

మరింత సమాచారం తెలుసుకోండి: