పొడుగు కాళ్ళ సుందరి కత్రినా కైఫ్ కోసం ఆత్మహత్య చేసుకున్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కథ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సినిమా తారల కోసం తమ విలువైన జీవితాలను కూడా లెక్క చేయకుండా అంతం చేసుకుంటున్న ఆ యువకుడి కథ తెలిస్తే సినిమా సెలెబ్రెటీలు సామాన్యుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో అర్ధం అవుతుంది. ఇక వివరాలలోకి వెళితే ఈ ప్రాణ త్యాగం చేసిన యువకుడు 22 ఏళ్ల ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి తనముందు ఉజ్వలమైన భవిష్యత్తు వున్నా బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ అంటే ఆ యువకుడికి ఉన్న  విపరీతమైన క్రేజ్ తో  ఆమె తనకు దక్కదు అని తెలుసుకుని ఈ వీరాభిమాని కత్రినాని తలుచు కుంటూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విద్యార్థి పేరు రాహుల్ కుమార్ సింగ్. బీహార్ కు చెందిన ఈ యువకుడు బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం విద్యార్థి. ఇండోర్‌లోని సంత్‌నగర్ లొకాలిటీలో వున్న తన ఫ్లాట్‌లో ఈ విద్యార్థి ఉరివేసుకుని సూసైడ్‌కి పాల్పడ్డాడు.  ఇతని మృతదేహం వద్ద ‘ఐ లవ్ కత్రినా ఏదో ఒకరోజు నిన్ను పొందుతాను’ అని రాసివున్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. సినిమా తారలను అభిమానించడం తప్పు కాక పోయినా మరీ ఈ స్థాయిలో వెర్రీగా అభిమానించడం అంత శ్రేయస్కరం కాదు..   

మరింత సమాచారం తెలుసుకోండి: