చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్ తాను నటించే చాల సినిమాలలో చిరంజీవి ప్రస్తావన తీసుకు వస్తూ ఆ మెగా హీరో వారసత్వాన్ని కొనసాగించడానికి తన వంతు ప్రయత్నాన్ని శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు. లేటెస్ట్ గా రామ్ చరణ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించబోతున్న సినిమాకు ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ ను పెడితే ఎలా ఉంటుంది అని దర్శకుడు శ్రీను వైట్ల ఆలోచిస్తున్నట్లు టాక్.  దీనికి కారణం చిరంజీవి సినిమాలలో బ్లాక్ బస్టర్ గా రికార్డులను క్రియేట్ చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ‘మై నేమ్ ఈజ్ రాజు’ అంటూ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ పాటలోని పల్లవిని చరణ్ కొత్త సినిమాకు టైటిల్ గా మారిస్తే సినిమా ప్రారంభం నుండే మంచి క్రేజ్ వస్తుందని శ్రీను వైట్ల ఆలోచన అని అంటున్నారు.  ఇప్పటికే ఈ విషయాన్ని శ్రీను వైట్ల రామ్ చరణ్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో ఈ టైటిల్ విషయమై ప్రస్తుతం మెగా కాంపౌండ్ చాల లోతుగా ఆలోచిస్తోంది అనే వార్తలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు నిజంగానే ఈ టైటిల్ ఫిక్స్ అయితే మెగా అభిమానులకు పండుగే..

మరింత సమాచారం తెలుసుకోండి: