ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి కన్నుమూశాడు అనే వార్త టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. గుండెపోటుతో చక్రి మృతి చెందాడు అని తెలుస్తోంది. దాదాపు 85 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రి జగపతిబాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాచి’ సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.  ఆయన వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో 1974 జూన్ 15న జన్మించారు. చక్రి సంగీతం సమకూర్చిన పాటల్లో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఉన్నాయి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, సింహా సినిమాల లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చిన ఘనత ఆయనది. ఆయన సంగీతం సమకూర్చిన ‘సత్యం’ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు వస్తే ‘సింహా’ సినిమాకు నంది అవార్డు వచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాలకు సంగీతం అందించిన ఖ్యాతి ఆయనది. చక్రీ సంగీత దర్శకత్వం వహించిన ‘ఎర్ర బస్సు’ ఈ మధ్యనే విడుదల అయింది. ఈయన సంగీతం సమకూర్చిన రేయ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఎంతో ప్రతిభా వంతుడిగా పేరుగాంచిన చక్రీ అతి చిన్న వయస్సులో 40 సంవత్సరాలకే అకాల మరణం చెందడం అందర్నీ షాక్ గురిచేస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: