నందమూరి హీరోల జపం చేస్తూ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి అను నిత్యం ప్రయత్నిoచే నారా రోహిత్ కు ఒక అనుకోని అనుభవం పవన్ వీరాభిమానుల నుంచి ఎదురైంది. లేటెస్ట్ గా ఈ నారా వారి విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీ నిర్వహించిన ఎక్స్‌లెన్సీ మీట్‌ కు చీఫ్ గెస్ట్‌గా వచ్చి అక్కడి విధ్యార్ధులను తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.  ఈ సందర్భంలో విధ్యార్ధులతో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ వారి తల్లితండ్రుల అభిరుచులను బట్టి కాకుండా వారికి ఏ విషయంలో అభిరుచి ఉంటే ఆ రంగంలో అవకాశాలను అన్వేషించుకోమని సందేశం ఇచ్చాడు నారా రోహిత్. ఇదే సందర్భంలో తాను లేటెస్ట్ గా నటిస్తున్న ‘పండగలా వచ్చాడు’ సినిమాలోని కొన్ని డైలాగ్స్ వినిపించి యూత్ ను ఆ కట్టుకున్నాడు.  ఆ తరువాత అక్కడి విద్యార్ధులకు మరింత జోష్ కలిగించడానికి బాలకృష్ణ ‘సింహా’ సినిమాలోని కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పగానే గీతం విధ్యార్థులు విపరీతంగా ఆనంద పడ్డారు. అయితే ఆ విద్యార్ధులలోని కొంతమంది పవన్ వీరాభిమానులు నారా రోహిత్ ను ‘గబ్బర్ సింగ్’ డైలాగ్స్ చెప్పమని కోరడంతో నారా రోహిత్ మరింత రెట్టించిన ఉత్సాహంతో పవన్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని కొన్ని పాపులర్ డైలాగ్స్ ను మంచి స్పీడ్ తో చెప్పేసరికి పవన్ అభిమానులకు కూడా నారా రోహిత్ అభిమాన హీరోగా మారిపోయాడు .. ఏమైనా రోహిత్ తెలివిగా బాలకృష్ణ, పవన్ లను సమతూకంలో పోగుడుకుని గీతం విద్యార్దుల మనస్సులను దోచుకుని క్రేజీ హీరోగా మారిపోయాడు..   

మరింత సమాచారం తెలుసుకోండి: