గత శుక్రువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన రజినీకాంత్ ‘లింగ’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా మొదటి మూడు రోజులలో 100 కోట్లు వసూలు చేసిందని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. అదేవిధంగా ఈ సినిమా ఓవర్సీస్ లో ముఖ్యంగా లండన్ మలేషియా దేశాలలో రికార్డు కలెక్షన్స్ ను వసూలు చేసిందని కోలీవుడ్ మీడియా వార్తలతో ఊదరకొట్టేస్తోంది.  అయితే కోలీవుడ్ విమర్శకులు మాత్రం ఈ అంకెల గారడీ అంతా రజినీ ఇమేజ్ పెంచడానికి చేస్తున్న ప్రయత్నం అని అభిప్రాయ పడుతూ ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనూ 70 కోట్లు మించి వసూలు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.  అయితే ఇన్ని సంచలనాలు క్రియేట్ చేసిన ‘లింగ’ ఒక విషయంలో మహేష్ కెరియర్ లో ఫ్లాప్ సినిమా అయిన ‘ఆగడు’ రికార్డులను కూడా క్రాస్ చేయలేక పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మహేష్ ‘ఆగడు’ అమెరికాలో మొదటి మూడు రోజులకు 1.4 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తే రజినీ ‘లింగ’ అమెరికాలో మొదటి మూడు రోజులకు 1.3 డాలర్స్ ను వసూలు చేసి ఓవర్సీస్ కింగ్ గా మహేష్ బాబుకు ఉన్న రికార్డును బ్రేక్ చేయలేకపోయింది అనే వార్తలు వస్తున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో ‘ఆగడు’ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కేవలం ఒకేఒక్క తెలుగు వర్షన్ కు సంబంధించినవి. అయితే రజినీ ‘లింగ’ తెలుగు, తమిళ భాషలలో రెండు వెర్షన్స్ లోను అమెరికాలో విడుదలైన రజినీ లింగా మహేష్ ఆగడు ను చేరుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయంగా మారడమే కాకుండా మహేష్ బాబుకు అమెరికాలోని తెలుగు ప్రజలలో ఎటువంటి క్రేజ్ ఉందో తెలియచేస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: