గత ఎన్నికలలో కాoగ్రెస్ ను తరిమి కొట్టండి అని పిలుపును ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరొక సామాజిక ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి పవన్ ప్రచారం చేయబోతున్నది వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రకృతి ఉద్యమం. చిన్న తనం నుండి వ్యవసాయం అంటే విపరీతమైన మక్కువ ఉన్న పవన్ తాను టాలీవుడ్ ఎంపరర్ గా మారినా తన అభిరుచులకు అనుగుణంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలలోఒక వ్యవసాయ క్షేత్రాన్ని పవన్ తన అభిరుచులకు అనుగుణంగా అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడ రకరకాల పండ్లను, కూరగాయలను పండించడం పవన్ కు ఇష్టం.  ఈ నేపధ్యంలో ప్రస్తుత కాలంలో ఇరు రాష్ట్రాలలోను జరుగుతున్న రసాయనాలతో కూడిన వ్యవసాయం వల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించి ఎటువంటి రసాయనాలు లేకుండా పండించే కూరగాయలు, పండ్లు గురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రకృతి ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి పవన్ అడుగులు వేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ ఉదయాన్ని పవన్ విజయరామ్ అనే వ్యక్తితో కలిసి ప్రారంభించబోతున్నట్లు టాక్. ఈ విషయాలను ప్రకృతి వ్యవసాయ ఉద్యమం పై కృషి చేస్తున్న విజయ్ రామ్ ఒక పత్రికకు ఇంటర్వ్యూలో తెలియచేసాడు. విజయ్ రామ్ ఈ రంగంలో చేస్తున్న కృషిని తెలుసుకున్న పవన్ ఆయనను పిలిచి అభినందించడమే కాకుండా త్వరలోనే ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయ్ రామ్ కోరినట్లుగా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తాను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తాను అని పవన్ చెప్పినట్లుగా విజయ్ రామ్ చెపుతున్నాడు.  అంతేకాదు విజయ్ రామ్ వ్యవసాయ క్షేత్రంలో పండిన రకరకాల కూరలను రుచి చూసిన పవన్ తన చిన్న తనంలో తన నాయనమ్మ వండిపెట్టినపుడు ఎంత రుచిగా ఉన్నాయో అంతే రుచిగా ఉన్నాయని పవన్ తెలిపారని విజయరామ్ అన్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే రానున్న రోజులలో పవన్ ప్రకృతి ప్రేమికుడిగా మారిపోయి పురుగు మందులు ఎరువులు వాడని పంటలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతాడు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: