గత రెండు మూడు రోజులుగా అంజలి పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడానికి కోలీవుడ్ కమెడియన్ సతీష్ స్వయంగా రంగంలోకి దిగాడు. తెలుగు తెర సీతమ్మ అంజలి కోలీవుడ్ కమెడియన్ సతీష్ ను పెళ్ళి చేసుకుంది అని కోలీవుడ్ మీడియా గగ్గోలు పెడుతూ వార్తలు రాయడంతో ఈ వార్తలు టాలీవుడ్ లో కూడా సంచలనంగానే మారాయి.  అయితే ఇటువంటి వార్తలు అంజలి పై రావడం టాలీవుడ్ మీడియాకు కొత్త కాదు కాబట్టి ఈ వార్తలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు మన మీడియా. ఇక కోలీవుడ్ లో వస్తున్న ఈ వార్తలకు చెక్ పెట్టడానికి స్వయంగా రంగంలోకి దిగిన సతీష్ అంజలితో తనకు పెళ్ళి జరిగింది అన్న వార్తలను ఖండిస్తూ తాను అంజలిని సినిమాల్లో తప్ప తానెక్కడా చూడలేదని, అలాంటపుడు తానెలా పెళ్లాడతానని కోలీవుడ్ మీడియా ముందు గగ్గోలు పెడుతున్నాడు ఈ హాస్య నటుడు.  అయితే ఈ తరహా రూమర్స్ ను ఎవరు క్రియేట్ చేస్తున్నారో తనకు అర్థంకావడం లేదంటు తన బాధను వెళ్ళబోసుకుంటున్నాడు. గతంలో ఒక బిజినెస్ మాన్ ను అంజలి పెళ్ళి చేసుకుందని కొన్ని రోజులు వార్తలు హల్ చల్ చేస్తే ఆ తరువాత అంజలి టాలీవుడ్ లోని ఒక నిర్మాతను పెళ్ళి చేసుకుందని వార్తలు వచ్చాయి. అంజలి తెలుగులో చేస్తున్న సినిమాలు చాల తక్కువే అయినా ఈ గాసిప్పుల వార్తలతో అంజలి కెరియర్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: