పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటే భగవంతుడు వరం ఇచ్చినట్లుగా చాలామంది ముచ్చట పడిపోతారు. అటువంటి పవన్ ఒక వ్యక్తికి ‘ఐ లవ్ యూ’ అంటూ తానంతట తాను ఫోన్ చేయడం ఆ ప్రశంసలు అందుకున్న సెలెబ్రెటీ మైండ్ ను బ్లాంక్ చేసేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో లక్ రాకెట్ లా పరుగు పెడుతున్న అనూప్ రూబెన్స్ హవా ప్రతిచోట వినిపిస్తూనే ఉంది. అటువంటి అనూప్ ‘గోపాల గోపాల’ పాటల కోసం ఇచ్చిన ట్యూన్స్ విపరీతంగా నచ్చిన పవన్ అనూప్ కు ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పడమే కాకుండా త్వరలో మళ్ళీ మనం కలిసి పనిచేయబోతున్నాo అని పవన్ అన్న మాటలు అనూప్ కు కొండంత బలం ఇవ్వడమే కాకుండా ఆ ఆనందాన్ని అందరికీ తెలియచేసే విధంగా తన ట్విటర్ లో షేర్ చేసుకున్నాడు.  ‘గోపాల గోపాల’ సినిమాలో కేవలం మూడు పాటలు మాత్రమే అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆ మూడు పాటల ట్యూన్స్ కు పవన్ ఈ విధంగా స్పందించాడు అంటే ఆ పాటల ట్యూన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అనే ఆ శక్తి అందరిలోనూ పెరిగి పోతోంది.  సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వచ్చే నెల 14న్ విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో విడుదల 28న జరగబోతోంది అనే వార్తలు ఇప్పటికే వస్తున్నాయి. అయితే అతి తక్కువగా మాట్లాడే పవన్ తిరిగి మనం కలిసి పని చేద్దాం అని అన్నాడు అంటే పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ కు దేవీశ్రీప్రసాద్ కాకుండా ఆ అవకాశాన్ని అనూప్ కొట్టేసాడా అని సందేహం..     

మరింత సమాచారం తెలుసుకోండి: