టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతున్న యాక్టర్ నందమూరి బాలక్రిష్ణ. బాలక్రిష్ణ రాజకీయంగానూ, సినిమా పరంగా తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా నందరమూరి నటిసింహం నటిస్తున్న అప్ కమింగ్ మూవీ పెద్ద సమస్యలో చిక్కుకుంది. ఇప్పటి వరకూ ఒకే రాష్ట్రంగా ఉన్న తెలుగు ప్రజలు, ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఫిల్మ్ ఛాంబర్ లోనూ కొంత గంధరగోళం కొనసాగుతుంది. ఎందుకంటే టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ లో ఎటువంటి మూవీ టైటిల్స్ రిజిస్టర్ అవుతున్నాయో, అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో ఏ టైటిల్స్ రిజిస్టర్ అవుతున్నాయో ఎవ్వరికి అర్ధం కాని పరిస్థితి. దీంతో బాలకృష్ణ అప్ కమింగ్ సినిమా లయన్, టైటిల్ వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. సత్యదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 98 వ చిత్రం సినిమాకి లయన్ అనే పేరుని ఎపి ఫిలిం చాంబర్ లో రిజిస్ట్రర్ చేయించారు. అయితే ఈ పేరుని తెలంగాణ నిర్మాత ఎప్పుడో తమ తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ వాదులు ఎలాగైనా లయన్ అనే టైటిల్ ని బాలక్రిష్ణ మూవీ నుండి తప్పించేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్ వివాదం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. వీలైనంత త్వరగా ఈ టైటిల్ వివాదాన్ని పరిష్కరించుకొని డిసెంబర్ 31 అర్ధరాత్రి టీజర్ ని విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ భావిస్తున్నారు. ఈ విషయాన్ని పరిష్కరించేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం తెలుస్తుంది. మొత్తంగా గతంలో బాలక్రిష్ణ సింహా అనే మూవీలో నటించాడు. ఇప్పుడు లయన్ అంటూ తన అప్ కమింగ్ మూవీ టైటిల్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. సింహా, లయన్ రెండు కూడ ఒకే మీనింగ్ కదా అని కొందరు పెదవి విరుస్తున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: