లేటెస్ట్ గా పవన్ కల్యాణ్, వెంకటేష్ లు తమ ‘గోపాల గోపాల’ సినిమా కోసం మేఘాల మధ్య ఎగిరిపోతూ పవన్ డ్రైవ్ చేస్తుంటే వెనుక వెంకటేష్ కూర్చుని ఉన్న గోపాలుడి బైక్ రైడింగ్ పోస్టర్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పోస్టర్ ను అధికారికంగా ఈ సినిమా నిర్మాతలు విడుదల చేసారా లేదంటే పవన్ వీరాభిమానులు ఈ పోస్టర్ ను క్రియేట్ చేసారా అనే విషయం పై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం మీడియాకు మాత్రం ఈ పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న కధనాల ప్రకారం ఈ సినిమాలో నాస్థికుడి పాత్ర పోషిస్తున్న వెంకటేష్ పై కొందరు దొంగలు దాడి చేసినప్పుడు కలియుగ కృష్ణుడి పాత్రను పోషిస్తున్న పవన్ పాత్రకు సంబంధించిన ఎంట్రీని ఇలా మోటార్ సైకిల్ పై స్పీడ్ గా వచ్చేడట్లు చేసి వెంకీని పవన్ రక్షించడమే కాకుండా దొంగలకు అందకుండా పవన్ వెంకటేష్ ను స్పీడ్ గా తన బైక్ పై తీసుకు వెళ్ళిపోతున్నప్పుడు పవన్ అభిమానులకు జోష్ కలిగించడానికి తీసిన మోటార్ బైక్ చేజింగ్ సీన్ లోని ఒక దృశ్యం ఇది అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాను అత్యంత భారీ మొత్తాలకు కొనుకున్న బయ్యర్లు ఈ సినిమా ప్రమోషన్ గురించి ఒత్తిడి పెంచుతూ ఉండటంతో పవన్ కు ఉన్న స్వభావ రీత్యా ఈ సినిమా ప్రమోషన్ కు పవన్ దూరంగా ఉన్నా వెంకటేష్ ఆ బాధ్యతను చేపట్టి ఛానల్స్ లో, పత్రికలలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ చేస్తానని మాట ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: