వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌, నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గోపాల గోపాల ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. అభిమానులు, ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం ఆ పోస్టర్‌ ఆకట్టుకుంది. దీంతో ఈ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ పై మరింత అంచనాలు పెరిగాయి.  ఈ పోస్టర్ సైతం ఆన్ లైన్ లో ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. గోపాల గోపాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం. అని డిసెంబర్‌లో పాటలను ఆవిష్కరిస్తాం'' అని తెలిపారు. సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా మూడు పాటలు ప్లాన్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ టాక్‌. అయితే వీటిలో ఒక పాట మాత్రం వెంకటేష్‌, పవన్‌ల మధ్య సాగుతుందనే వార్తలు వచ్చాయి. పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: