కొత్త సంవత్సరం ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలు కావడంతో భాగ్యనరం అంతా న్యూయియర్ పార్టీల హడావిడికి సంబంధించిన వార్తలతో హోరెత్తి పోతోంది. అయితే ఈ వార్తల మధ్య హాట్ బ్యూటీ సన్నీలియోన్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హైదరబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఒక కన్వెక్షన్ హాల్ లో చేయబోతున్న డాన్స్ హంగామా ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని పిఎక్స్ & ఆర్ ఎన్ హెచ్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మీడియాకు వెల్లడించింది. ఈ సంస్థ ప్రతినిధి ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సన్నీ ఈ న్యూయిర్ పార్టీ కార్యక్రమంలో చేస్తున్నవి రెండే రెండు పాటలకు డాన్స్ లు అయినా ఆమెకు ఉన్న క్రేజ్ రీత్యా అత్యంత భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆమెను ఈ కార్యక్రమానికి రప్పించడానికి గత మార్చి నుండి ప్రయత్నిస్తే అత్యంత కష్టం పై ఆమె ఈ న్యూయిర్ పార్టీకి రావడానికి అంగీకరించిందని తెలియచేసారు. అదేవిధంగా సన్నీ ఈ కార్యక్రమంలో డాన్స్ చేస్తున్న సందర్భంగా ముంబాయ్ నుండి ప్రత్యేకమైన సెక్యూరిటీతో ఈ కార్యక్రమానికి వస్తోందని అంటూ ఆమెకోసం 20 మంది ప్రత్యేక వ్యక్తిగత గాడ్స్ ను కూడా ఏర్పాటు చేసామని ఈ కార్యక్రమ నిర్వహక ప్రతినిధి చెపుతున్నాడు. ఈ కార్యక్రమంలో సన్నీ పాల్గొనడానికి అత్యంత భారీ స్థాయిలో పారితోషికం ఇచ్చాము అని చెపుతున్న ఈ నిర్వాహకుల మాటలను బట్టి ‘కరెంట్ తీగ’ సినిమాలో పాట కోసం దాదాపు 40 లక్షలు చుట్టిన సన్నీ ఈ న్యూయిర్ పార్టీకి కనీసం కోటి రూపాయలు అయినా చుట్టేసింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: